ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో 62 ఏళ్ల వృద్ధుడు మరణించడం కలకలం రేపుతోంది. ఇతను ఇటీవల నిజామాబాద్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తికి స్నేహితుడు కావడం గమనార్హం. ఈ వ్యక్తి మరణించడంతో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపడుతున్నారు. కొంత మంది వైద్య సిబ్బందిపై బంధువులు దాడికి యత్నించారు. అయితే, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి బాగా విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా, గుండెపోటు వచ్చిందని, దీనివల్లే అతను మరణించాడని వైద్యులు చెబుతున్నారు.
వృద్ధుడు చనిపోయాడనే వార్త తెలియగానే అతని తాలూకు బంధువులు ఆస్పత్రికి చేరుకొని విలపించారు. ఈ క్రమంలో అతని మృత దేహాన్ని తాకుతూ బాధపడ్డారు. ఆ వ్యక్తి కరోనా అనుమానిడు కాబట్టి బంధువులు మృత దేహాన్ని తాకకుండా ఉండేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆ వ్యక్తిని తాకిన 11 మంది బంధువులను ప్రభుత్వ వైద్య సిబ్బంది ఐసోలేషన్ వార్డుకుకు తరలించారు.
నిజామాబాద్ జిల్లాలో తొలి కరోనా కేసు ఈ నెల 28న నమోదైన సంగతి తెలిసిందే. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో ఉండేవిద్యుత్ శాఖలో పని చేసి, పదవి విరమణ పొందిన ఉద్యోగి మార్చి 12న దిల్లీ వెళ్లి వచ్చాడు. జ్వరం, దగ్గు లక్షణాలతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి రాగా, అతడ్ని అదే రోజు హైదరాబాద్‌కు తరలించారు. గాంధీలో పరీక్షలు జరపగా అతనికి కరోనా ఉన్నట్లు తేలింది.